సమస్యల పరిష్కారానికే భూ వాణి


Sun,June 16, 2019 12:07 AM

-రైతులు సద్వినియోగం చేసుకోవాలి
-తాసిల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి
రాయికోడ్‌: రెవెన్యూ సమస్యల పరిష్కారానికే కలెక్టర్‌ హనుమంతరావు ప్రవేశ పెట్టిన భూ వాణి కార్యక్రమాని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం తాసిల్దార్‌ కార్యాలయంలో మండల వీఆర్వోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ....రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టి 90 శాతం సమస్యలను పరిష్కరించామన్నారు. ప్రభుత్వం అందజేసిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలలో భూమి తక్కువగా విస్తీర్ణం, సర్వే నంబర్‌ తప్పుగా రావడం, రైతుబంధు రాకపోవడం, ఇలా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకే కలెక్టర్‌ భూ వాణి కార్యాక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండల కేంద్రమైన రాయికోడ్‌లో ఈ నెల 21వ తేదీన తాసిల్దార్‌ కార్యాలయ అవరణంలో భూ వాణి కార్యాక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు గ్రామాల్లో విసృత్త స్థాయిలో ప్రచారం చేసి రెవెన్యూ సమస్యలను తీర్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉప తాసిల్దార్‌ కిష్టయ్య, వీఆర్వోలు శంశీర్‌అల్లీ, గణపతి, మల్లేశం, విష్ణు, మల్లప్ప, శివారాజ్‌, మణిక్యం, తదితరులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...