వైభవంగా వారోత్సవ పూజలు


Sun,June 16, 2019 12:07 AM

సంగారెడ్డి మున్సిపాలిటీ: వేంకటేశ్వరస్వామి వారి వారోత్సవ పూజల్లో భాగంగా శనివారం మహాలక్ష్మి గోదా సమేత విరాట్‌ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం (వైకుంఠపురం)లో ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం గర్భాలయంలో కొలువుదీరిన పద్నాలుగు అడుగుల వేంకటేశ్వరస్వామి వారి మూలమూర్తికి పాంచరాత్ర ఆగమానుసారంగా, పంచామృతం, పలు రకాల పరిమళ భరితమైన ద్రవ్యాలు, పవిత్ర జలాలలతో అభిషేకాలను శాస్ర్తోక్తంగా జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రిత్విక్‌ల వేదమంత్రోశ్చరణల మధ్య యజ్ఞ హోమాలు జరిపారు. శ్రీవాసుదేవ, సుదర్శన, నారసింహ, మహాలక్ష్మి సహిత హనుమత్‌, గరుడ హోమాలను నిర్వహించారు. వేలాదిగా పాల్గొన్న భక్తుల గోవిందనామ స్మరణల మధ్య యజ్ఞ భగవానుడికి అవిస్సులను సమర్పించి పూర్ణాహుతి గావించారు. ఉభయ దేవేరులతో శ్రీనివాసుని పల్లకీపైకి వేంచేపు చేసి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. పూజలకు జిల్లా విద్యుత్‌ శాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎం.రవికుమార్‌ దంపతులు పాల్గొని వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన వేలాది భక్తులకు వేదాశీర్వచనం చేసిన అర్చకులు తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం అందించారు. కార్యక్రమంలో జై శ్రీమన్నారాయణ చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...