కరువులో ఫలితమిచ్చిన పచ్చి మేత సాగు


Sun,June 16, 2019 12:07 AM

సిర్గాపూర్‌: వేసవిలో పశువులకు పశుగ్రాసం కరువు కావడంతో అడుగంటిన చెరువులు, ప్రాజెక్టు శిఖం భూముల్లో సాగు చేసిన పచ్చి మేత పండి మంచి ఫలితమిచ్చిందని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ రాథోడ్‌ రామారావు అన్నారు. శనివారం ఆయన తమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ రంగయ్య, స్థానిక పశువైద్యాధికారి డాక్టర్‌ జెస్సీ క్రాంతిలతో పాటు నల్లవాగు శిఖం భూముల్లో రైతులు సాగు చేస్తున్న పచ్చిగడ్డి కోతలను వారు పరిశీలించారు. ఈమేరకు వారు స్థానిక రైతులతో మాట్లాడి తగు సలహాలు సూచనలిచ్చారు. జేడీ రామారావు మాట్లాడుతూ కరువులో రైతుల పశువులకు పచ్చి మేత వేసేందుకు సాగు కోసం రైతులన ప్రోత్సహించి ఉచితంగా జొన్నగడ్డి విత్తనాలను సరఫరా చేశామన్నారు. దాంతో దాదాపు ఇక్కడ 80 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పండిస్తున్నట్లు పేర్కొన్నారు. 45 రోజుల కోమారు ఈ గడ్డి కోతకు వస్తుందని ఇలా మూడు సార్లు దీనిని కోసి పశువులకు వేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నాగభూషణం, సిర్గాపూర్‌ వెటర్నరీ అసిస్టెంట్‌ సూర్యకాంత్‌ తదితరులున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...