మొగుడంపల్లి ఎంపీపీగా ప్రియాంక


Sun,June 16, 2019 12:07 AM

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ : మొగుడంపల్లి మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా ప్రియాంక ఎన్నికయ్యారు. శనివారం మొగుడంపల్లిలో మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించారు. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 5, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిపొందారు. గతంలో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిపొందిన విటునాయక్‌తండాకు చెందిన పుణిబాయి టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిన్నారు. మన్నాపూర్‌ ఎంపీటీసీ ప్రియాంక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. ఎంపీపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ఎన్నికల అధికారులు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం మొదటి ఎన్నికలు నిర్వహించగా మన్నాపూర్‌ ఎంపీటీసీ కాంగ్రెస్‌ అభ్యర్థి తజోద్దీన్‌కు మద్దతు ఇవ్వడంతో గెలిపొందారు. ఎంపీపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సభ్యులు మన్నాపూర్‌ ఎంపీటీసీ ప్రియాంకకు మద్దతు ఇచ్చారు. వైస్‌ ఎంపీపీగా మొగుడంపల్లి-1 ఎంపీటీసీ హసీన బేగం ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ ప్రియాంక కాంగ్రెస్‌ ఎంపీటీసీల మద్దతుతో మండల పరిషత్‌ అభ్యక్షురాలు ఎన్నికయ్యారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...