మహబూబ్‌సాగర్‌ను సుందరీకరణ చేయాలి


Sat,June 15, 2019 12:03 AM

సంగారెడ్డి మున్సిపాలిటీ : పట్టణంలోని మహబూబ్‌సాగర్‌ చెరువును సుందరీకరణ చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం మహబూబ్‌సాగర్‌ చెరువును పరిశీలించారు. చెరువులో చెత్త పేరుకుపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే చెరువులోని చెత్తను తొలిగించాలని ఇన్‌ చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ సుదర్శన్‌రెడ్డిని ఆదేశించారు. చెరువులో పొదలను తొలిగించాలని ఈవై మధుసూదన్‌రెడ్డిని ఆదేశించారు. చెరువులో చెత్త ను వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూ చించారు.ప్రతిరోజు చెత్తను సేకరించాలని సం బంధిత అధికారులకు సూచించారు. మహబూబ్‌సాగర్‌లోని చెత్తను తొలిగించి చెరువును సుందరీకరణ చేయాలని ఆదేశించారు. పర్యాటకులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని తెలిపారు. అనంతరం పట్టణ శివారులోని శిల్పారామంను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, కౌన్సిల్‌ సభ్యులు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...