బాల్య వివాహాలు నేరం


Sat,June 15, 2019 12:03 AM

సంగారెడ్డి టౌన్‌ : బాల్య వివాహాలు నేరమని, వాటిని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి భవానీ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మహిళా ప్రాంగణంలో మెడ్వాన్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో మహిత ప్లాన్‌ ఇండియా సహకారంతో సెల్ప్‌హెల్ప్‌ గ్రూపు, మండల సమా ఖ్య, జిల్లా సమాఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేద చట్టంపై సెల్ప్‌హెల్ప్‌ గ్రూపు సభ్యులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలికలకు సెకండరీ ఎడ్యుకేషన్‌ ఎంతో ముఖ్యమని, బాలికలను చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. డీడబ్ల్యూవో మోతీ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిగే విధానాన్ని వారికి వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో జయశ్రీ, మెడ్వాన్‌ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు చంద్రకళ, మహిత కో-ఆర్డినేటర్‌ విజయరేఖ, చైల్డ్‌ లైన్‌ కో-ఆర్డినేటర్‌ యాదగిరి, నవీన్‌, లక్ష్మణ్‌, సెల్ప్‌హెల్ప్‌ గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...