గ్రంథాలయాలకు నూతన పుస్తకాలు


Sat,June 15, 2019 12:03 AM

సంగారెడ్డి టౌన్‌ : 2018-19 సంవత్సరానికి గాను నూతన పుస్తకాలను గ్రంథాలయాలకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేశామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విలేకర్లుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ఉపయోగపడేలా నిపుణులు పర్యవేక్షణ తర్వాత కొత్త పుస్తకాలను జిల్లాలోని అన్ని శాఖల గ్రంథాలయాలకు అందించేందుకు రూ. 25లక్షల విలువ గల 27వేల పుస్తకాలను కొనుగోలు చేశామన్నారు. అదే విధంగా గ్రంథాలయంలో డిజిటల్‌ లైబ్రెరీ యాప్‌ను ఏర్పాటు చేసి పాఠకులకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 19 గ్రంథాలయాలకు నూతన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వసుంధర, డైరెక్టర్లు కుమార్‌గౌడ్‌, విఠల్‌, రైతు సమన్వయసమితి కన్వీనర్‌ మల్లేశం, ఇంద్రకరణ్‌ ఉపసర్పంచ్‌ నరేశ్‌గౌడ్‌, గ్రంథాలయ సిబ్బంది సురేశ్‌కుమార్‌, కిషన్‌, హెచ్‌ఆర్‌ వెంకటరమణ, ఆర్‌.శ్రీనివాస్‌, ఎల్‌, ప్రశాంత్‌కుమార్‌, శోభారాణి తదితరులు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...