ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన


Sat,June 15, 2019 12:03 AM

సంగారెడ్డి టౌన్‌: ఎస్‌ఐ, కానిస్టేబుళ్లుగా రాత పరీక్షలో ఉత్తీర్ణులైన పోలీసు ఉద్యోగార్థుల సర్టిపికెట్లను పరిశీలించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎస్పీ మహేందర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలో మొత్తం 560 మంది అర్హత సాధించగా సర్టిఫికెట్ల పరిశీలనకు 510 మంది హాజరయ్యారు. రాత పరీక్షతో పాటు వివిధ ఈవెంట్లలో ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ప్రభుత్వ ఆదేశాల మేరకు హాజరుకావాలని అభ్యర్థులకు సూచించడంతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...