నాణ్యమైన విద్యను గీతం అందజేయాలి


Fri,June 14, 2019 12:34 AM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ: గీతం అధ్యాపకులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయాల్సిన గురుతర బాధ్యత ఉందని గీతం ప్రో వీసి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ అన్నారు. గురువారం గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో అధ్యాపకులతో ముఖాముఖిగా చర్చించారు. ఈ సందర్భంగా అధ్యాపకులంతా నాణ్యమైన బోధనతో పాటు పరిశోధనలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పాఠ్యాంశాలను బోధించడానికి ఉద్దేశించిన దృశ్యశ్రావణ (పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు) సమాచారాన్ని ముందుగానే విద్యార్థులకు అందజేయాలని, వారి నుంచి ప్రశ్నలు రాబడుతూ (యాక్టివ్ బేస్డ్ లెర్నింగ్)కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యాభ్యాసన పద్ధతులను అనుసరించాలని సూచించారు. విద్యార్థులు లేవనెత్తిన సందేశాలకు తక్షణమే జవాబు ఇవ్వలేమన్నప్పుడు సీనియర్ అధ్యాపకుల సహకారంతో మరునాడు సరైన సమాధానం ఇవ్వాలని సలహా ఇచ్చారు. తరగతి గదిలో ఉన్న 50 నిమిషాలు ప్రభావశీలంగా విద్యాబోధన చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా అసైన్‌మెంట్లు ఇచ్చి, వాటిని పూర్తి చేసేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. పాఠ్యపుస్తకాలతో పాటు వెబ్‌సైట్లలో ఎంతో విజ్ఞానం అందుబాటులో ఉన్నదని, దానిని బాగా మదించి అత్యుత్తమ బోధన చేయడాన్ని అలవర్చుకోవాలన్నారు. గీతం పాఠ్యప్రణాళిక (సిలబస్)ను 180 నంచి 160 క్రెడిట్స్ తీసువస్తూ, బోధనతో పాటు ఆచరణాత్మక విద్యకు ప్రాధాన్యత పెంచినట్టు ప్రొఫెసర్ శివప్రసాద్ వెల్లడించారు. మరో నాలుగేండ్లలో ఎటువంటి విద్య అవసరమో ముందుగానే ఊహించి తాము రూపొందిన సిలబస్‌కు చట్టబద్ధ సంస్థ అధిపతుల నుంచి కూడా ప్రశంసలు వచ్చినట్ట అధ్యాపకులకు వివరించారు. అధ్యాపకులకు అభిరుచి ఉన్న రంగంలో పరిశోధనలు చేపట్టి పత్ర సమర్పణ చేయాలని, పరిశ్రమలకు అవసరమైన సేవలను కూడా అందజేయాలని అన్నారు. ఒక అధ్యాపకుడు వ్యక్తిగతంగా ఎదిగితే అది సంస్థ ఎదుగుదలకు దోహదం చేస్తుందని ప్రో వీసీ అన్నారు. అధ్యాపకులను ప్రోత్సహించేలా ఓ పర్యావేక్షణ వ్యవస్థను తాము రూపొందిస్తున్నామని, బాగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తామన్నారు. గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ మాట్లాడుతూ పీపీటీలన అత్యాధునిక పరిజ్ఞానం సాయంతో విద్యార్థులను ఆకట్టుకునేలా రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...