నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో పనిచేయాలి


Fri,June 14, 2019 12:34 AM

సంగారెడ్డి చౌరస్తా: పాఠశాలలు పునఃప్రారంభమైనందున మొదటి రోజు నుంచే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో పని చేయాలని కలెక్టర్ హనుమంతరావు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పని చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడిబాట ప్రారంభ కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ సంవత్సరం పదో తరగతిలో నూటికి నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పని చేయాని సూచించారు. ఈ ఏడాది పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి పిల్లలను బడికి వచ్చే విధంగా పర్యవేక్షణ చేసి పాఠశాలల్లో హాజరుశాతం పెరగడానికి కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా నాల్గో తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థుల విద్యా విధానంలో మార్పు రావాలని అప్పుడే పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతకు అవకాశం ఉంటుందన్నారు. బాగా చదివే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి కావాల్సిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే మెలుకువలు నేర్పించే విధంగా చూడాలని కలెక్టర్ వివరించారు. వారిని పదో తరగతిలో ఉత్తమ విద్యార్థిగా మార్చేందుకు ఉపాధ్యాయులకు తమవంతు సాయం ఎల్లప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు.

మేము సైతం...
ఈ ఏడాది మేముసైతం అనే ఒక కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నూతన కార్యక్రమంలో భాగంగా పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులచే అదనపు తరగతులు నిర్వహించి విద్యార్థులకు వినూత్న ప్రయోగం చేయాలని సూచించారు. ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా పని చేయాలని, అప్పుడే నాణ్యమైన, మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో డీఈవో విజయలక్ష్మి, ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...