మన ఎంపీలకు సముచిత గౌరవం


Fri,June 14, 2019 12:33 AM

సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి : ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇద్దరు ఎంపీలకు సముచిత గౌరవం లభించింది. రెండు పర్యాయాలు ఎంపీలుగా గెలుపొందిన ఇద్దరికీ పార్టీలో మంచి స్థానం లభించింది. లోక్‌సభలో పార్టీ ఉప నాయకుడిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ విప్‌గా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌లను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలకు పదవులు లభించడంపై సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా నామా నాగేశ్వరరావును ఎన్నుకోగా ఉప నాయకుడిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి, విప్‌గా బీబీ పాటిల్‌లు గురువారం ఎంపికయ్యారు. 2014తో పాటు ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా ఇద్దరూ మంచి మెజార్టీతో విజయం సాధించారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధికి ఇద్దరూ కృషి చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ సౌమ్యులుగా పేరుతెచ్చుకున్నారు. రెండు సార్లు గెలుపొందడం, మంచి పేరున్న ఇద్దరి పనితీరును గుర్తించిన సీఎం కేసీఆర్ లోక్‌సభలో పార్టీ తరఫున పదవులు ఇచ్చి మరింత గౌరవం కల్పించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...