యువత భవిష్యత్ కోసమే జాబ్‌మేళా


Fri,June 14, 2019 12:33 AM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: నారాయణఖేడ్ ప్రాంతంలోని నిరుద్యోగ యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నెల17న నారాయణఖేడ్‌లో జాబ్‌మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ టాటా ైస్ట్రెవ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ హైదరాబాద్ వారి సహకారంతో ఆరోజు ఉదయం 9 గంటలకు స్థానిక రెహమాన్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించడం జరుగుతుందన్నారు. జాబ్‌మేళాలో ఎంపికైన యువతీ, యువకులకు హైదరాబాద్‌లో శిక్షణనివ్వడం జరుగుతుందని, ఇందుకోసం శిక్షణార్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగావకాశం కల్పించడం జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు జాబ్‌మేళాకు హాజరైన పక్షంలో వారి విద్యార్హతను బట్టి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి,యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...