బడిబాటను విజయవంతం చేయాలి


Wed,June 12, 2019 10:59 PM

న్యాల్‌కల్ : బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మండల విద్యాధికారి మారుతిరాథోడ్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిబాట కార్యక్రమం ఈ నెల 14 నుంచి 19 వరకు జరుగుతుందన్నారు. 14వ తేదీన గ్రామాల్లో ర్యాలీలు, కరపత్రాల పంపిణీ, పాఠశాల విద్యా కమిటీ, ఉపాధ్యాయులు కలిసి అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాల్సి ఉంటుందన్నారు. 15న బాలిక విద్యా సంబంధించి, 16న పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం, 17న స్వచ్ఛ పాఠశాల, 18న విద్యాకమిటీ సభ్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లల సర్వే, బాల కార్మికుల విముక్తి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. 19వ తేదీన పదో తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, పాఠశాలలో అత్యధిక హాజరు శాతం కలిగిన విద్యార్థులను సన్మానించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, పాఠశాల కమిటీ చైర్మన్లు, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రుల, ప్రజలు హాజరై జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మార్సీ సిబ్బంది, పాఠశాలల హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

పునఃప్రారంభమైన పాఠశాలలు...
రెండు నెలల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం పునంఃప్రారంభమయ్యాయి. మండల పరిధిలోని 9 జిల్లా పరిషత్, 13 ప్రాథమికోన్నత, 45 ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం నుంచి తలుపులు తెరుచుకున్నాయి. మొ దటి రోజు ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కలిసి పాఠశాలల్లో చెత్త చెదరాన్ని తొలిగించారు.

బడిబాటను నిర్వహించాలి...
కోహీర్ : మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాటను విజయవంతంగా నిర్వహించాలని మండల విద్యాధికారి శంకర్ కోరారు. బుధవారం కోహీర్ పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో శంకర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మండలంలో బడిబాటను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని సూచించారు. మధ్యాహ్న భోజన వివరాలను రోజు వారీగా వెంటనే సమాచారం అందించాలన్నారు. సమావేశంలో హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...