కాలువ మంజూరు చేయండి


Wed,June 12, 2019 10:58 PM

అందోల్, నమస్తే తెలంగాణ: సింగూర్ కాలువ ద్వారా తమ గ్రామానికి నీటిని అందించాలని సీడీసీ డైరెక్టర్ జైపాల్‌నాయక్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం పరిధిలోని వ్యవసాయ భూములను సాగుచేసుకునేందుకు చెరువుల నీరే ఆధారమని, వాటితోనే భూములను సాగు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారని తెలిపారు. సింగూర్ ప్రాజెక్టు నీటిని కాలువల ద్వారా అందోలు, పుల్కల్ మండలాల భూములకు సాగుకు నీటిని అందిస్తున్నారని, తమ గ్రామం నుంచి కేనాల్ ఉన్నా, మా చెరువుల్లోకి నీటిని తరలించేందుకు కాలువ లేదని, కాలువను ఏర్పాటు చేయించినట్లయితే పోసుకుంట, యాసానిచెరువు, గొల్లకుంట చెరువుల్లోకి నీరు వస్తుందన్నారు. ఆయా చెరువుల కిందనున్న తమ భూముల్లోకి పుష్కలమైన నీరు వస్తుందన్నారు. ఆయా చెరువుల్లోకి నీటిని తరలించేందుకు కాలువను మంజూరు చేయాలని ఎమ్మెల్యేను ఆయన కోరారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి కాలువ మంజూరు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమతి సభ్యులు సుభాష్, రవీందర్, సోనిబాయి, సుదర్శన్, బీమ్లా, ప్రవీణ్, శ్రీనివాస్, అంజయ్య ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...