పార్టీలకు అతీతంగా అభివృద్ధి


Wed,June 12, 2019 10:58 PM

అందోల్, నమస్తే తెలంగాణ: పార్టీలకు అతీతంగా ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు సహకరించాలని, అందోలు-జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని కుల సంఘాలు, మేధావులతో కలిసి కమిటీని ఏర్పాటు చేసుకుందామని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం జోగిపేట వాసవీ కల్యాణ మండపంలో ఎస్‌డీఎఫ్ కింద మంజూరైన రూ.20 లక్షలతో రేకుల షెడ్ ఏర్పాటు పనులను జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జోగిపేట పట్టణాన్ని వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు పి.జైపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ.నాగభూషణం, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు లింగాగౌడ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి, పీఆర్ డిప్యూటీఈఈ రామారావు, ఏఈ కురుమయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ అల్లె శ్రీకాంత్, కౌన్సిలర్ గాజుల నవీన్, మాజీ ఎంపీపీ హెచ్.రామాగౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ గంగా జోగినాథ్, వర్తక సంఘం అధ్యక్షుడు రంగ సురేశ్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జూకంటి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు పెండ్యాల రాములు, మండల అధ్యక్షుడు ఎం.మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు పోల రఘునాథ్, చేనేత సంఘం మాజీ అధ్యక్షుడు సత్యం, నాయకులు ఎం.విజయ్‌కుమార్, మల్లయ్య యాదవ్, మహేశ్ యాదవ్, నాగరాజ్, శివకుమార్, సందీప్‌గౌడ్, పత్తి వీరేశం, రంగ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...