ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు


Tue,June 11, 2019 11:24 PM

- రికార్డులను పరిశీలించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు
- 32 పత్తి విత్తన ప్యాకెట్లు సీజ్
వట్‌పల్లి: మండల కేంద్రం వట్‌పల్లితో పాటు మర్వెల్లి, ఖాదీరాబాద్ గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో మంగళవారం జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ అడిషనల్ ఎస్పీ మహేందర్, జిల్లా అగ్రికల్చర్ అధికారి శ్రీనివాస్‌ప్రసాద్ స్థానిక పోలీసులతో కలిసి దుకాణాల్లో నిలువ చేసిన ఎరువులు, విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు వాడుతూ రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్తీలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేయడం జరుగుతున్నద పేర్కొన్నారు. దుకాణాల్లో వ్యాపారులు నకిలీ ఉత్పత్తులను విక్రయించినట్లు అనుమానం వస్తే రైతులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనేముందు సంబంధిత డీలర్లుకు ప్రభుత్వ అనుమతి ఉన్నదా...అతను విక్రయించే ఎరువులు నాణ్యమైనవేనా అని పరిశీలించుకోవాలన్నారు. రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాల ధరల్లో వ్యతాసం ఉండకూడదని వ్యాపారులకు సూచించారు. రశీదుల్లో ఉన్న ధరలు..దుకాణాల్లో పట్టికలో ఉండే ధరలు ఒకేలా ఉండాలని అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వ్యాపారులు విక్రయాలు, స్టాక్ రిజిస్టర్లను తప్పనిసరిగా రికార్డు చేయాలని ఇష్టానూసారంగా విక్రయాలు జరిపితే లైసెన్స్‌లు రద్దు చేస్తామని తెలిపారు. అనంతరం పత్తి విత్తనాల ప్యాకెట్లు, ఎరువుల సంచులపై తయారి, గడువు తేదీతో పాటూ దుకాణాల్లో జరిపే రోజువారి విక్రయాల రికార్డులను అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, వ్యవసాయ అధికారి మహేశ్‌చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

32 పత్తి ప్యాకెట్లు సీజ్
ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లో నిల్వ చేసిన 32 పత్తి విత్తనాల ప్యాకెట్లను సీజ్ చేసి వట్‌పల్లిలోని వ్యవసాయ కార్యాలయాలనికి తరలించినట్లు మండల వ్యవసాయ అధికారి మహేశ్‌చౌహాన్ తెలిపారు. కిరాణ దుకాణంలో పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో మంగళవారం టాస్క్‌ఫోర్స్ బృందం మర్వెల్లి గ్రామంలోని పోల రాములు కిరాణ దుకాణంలో తనిఖీలు చేయడం జరిగిందన్నారు. వారి తనిఖీల్లో వివిధ కంపెనీలకు చెందిన 32 పత్తి ప్యాకెట్లు లభించాయని వివరించారు. ప్యాకెట్లకు సంబంధించి దుకాణ యజమాని రాములు సరైన వివరాలు చెప్పకపోవడంతో సాక్షుల సమక్ష్యంలో వాటిని సీజ్ చేసి వట్‌పల్లికి తరలించడం జరిగిందన్నారు. పత్తి ప్యాకెట్లను దుకాణంలో ఎందుకు నిల్వచేశారో సరైన ఆధారాలు చూపకపోతే అతడిపై కేసు నమోదు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా పత్తి విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్ని గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ వ్యాపారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...