ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Tue,June 11, 2019 11:24 PM

- 80 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
- ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
పెద్ద శంకరం పేట: ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెద్ద శంకరంపేటలోని స్త్రీ శక్తి భవనంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన 90 మంది మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కావద్దనే యోచనతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. దీని ద్వారా 18 ఏండ్ల్లు నిండిన ఆడపిల్లలకు పెండ్లి సమయంలో రూ.100,116లను ప్రభత్వం అందిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలకు అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. పేదింట్లో ఆడపిల్ల పుట్టినా భారం కావద్దనే ఉద్దేశంతో ఈ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్1గా నిలిచిందన్నారు. అవినీతి రహిత పరిపాలనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆసరా పింఛన్లు పెంచిన ఘనత మొదట మన ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు వితంతువులు, దివ్యాంగులు, వృద్ధ్యాప్య, గీత, చేనేత, బీడీ, కార్మికులు పింఛన్లు ఇస్తుండగా ఒంటరి మహిళలకు సైతం పింఛన్లు ఇస్తుందన్నారు. వచ్చే నెల నుంచి రెట్టింపు ఆసరా వస్తుందన్నారు. వితంతు, వృద్ధ్యాప్య, గీతా, చేనేత, బీడీ కార్మికులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ప్రభుత్వం చెల్లించెందుకు ప్రభత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.అలాగే రైతుబంధు, రైలు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాసాడ రాజు, నూతన ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విజయరామరాజు, మండల టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మురళిపంతులు, సర్పంచ్ సత్యనారాయణ, రైతు సమితి మండల అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ఎంపీటీసీలు సుభాశ్‌గౌడ్, సుశీల, మాణిక్‌రెడ్డి, బోండ్ల దత్తు, రమేశ్, నాయకులు మల్లేశం, శంకర్‌గౌడ్, పెరుమాల్‌గౌడ్, రవీందర్, అశోక్, శంకరయ్య, సాయిలు ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...