జడ్పీ వైస్ చైర్మన్‌కు సన్మానం


Tue,June 11, 2019 11:24 PM

జిన్నారం: జడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన జడ్పీటీసీ కుంచాల ప్రభాకర్‌ను కొడకంచి గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు సోమవారం రాత్రి సన్మానించారు. సర్పంచ్ శివరాజ్, గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్‌తో పాటు కొడకంచి ఎంపీటీసీ బత్తుల సంతోషమహేశ్, జిన్నారం-1 ఎంపీటీసీ లావణ్య, సోలక్‌పల్లి ఎంపీటీసీ స్వాతి, కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ అహ్మద్‌లను శాలువా, పూలమాలలతో సన్మానించారు. మండల జడ్పీటీసీ, కొడకంచి ఎంపీటీసీని టీఆర్‌ఎస్ గెల్చుకోవడం సంతోషంగా ఉందని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మల్లేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
వైస్ ఎంపీపీకి ముదిరాజ్ సంఘం నాయకుల సన్మానం
వైస్ ఎంపీపీగా ఎన్నికైన గంగు రమేశ్‌ను ముదిరాజ్ సంఘం నాయకులు సన్మానించారు. మంగళవారం ఊట్లలో ఆయనను ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు భవానీ రమేశ్, సభ్యులు బ్రహ్మేందర్, గణేశ్, రవీందర్, మహేందర్, పూజారి శ్రీనివాస్ కలిసి శాలువా, పూలమాలతో సన్మానించారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...