సోయా విత్తనాల పంపిణీ ప్రారంభం


Tue,June 11, 2019 11:24 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : జహీరాబాద్‌లో వ్యవసాయ శాఖ అధికారులు సబ్సిడీపై రైతులకు సోయా విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం జహీరాబాద్ వ్యవసాయశాఖ కార్యాలయంలో రైతులకు సోయా, జనుము విత్తనాలు పంపిణీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్లస్టర్ల వారీగా విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. ఏఈవోలు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డుల వివరాలు తీసుకొని కూపన్లు పంపిణీ చేస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు రైతులకు సకాలంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అదేశాలు జారీ చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులు సరఫరా చేస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి...
ఝరాసంగం : సోయా విత్తనాల పంపిణీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ సంగారెడ్డి సూచించారు. మంగళవారం ఝరాసంగంలో ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కార్యాలయంలో రైతులకు సోయా విత్తనాల పంపిణీ కా ర్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ గతంలో విత్తనాల పంపిణీని స కాలంలో చేయకపోవడం మూలంగా రైతులు అ నేక ఇబ్బందులకు గురయ్యేవారని ఆయన గుర్తు చే శా రు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ప్రభుత్వం వానకాలం ఆరంభానికి ముందే విత్తనాలను అందుబాటులో ఉంచి పంపిణీ చేశామన్నారు. అంతే కాకుండా రైతులకు అవసరం మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నా రు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా మూడు సొసైటీ, ప్ర త్యేక కేంద్రాల్లోనే విత్తనాలను అందుబాటులో ఉం చినట్లు పేర్కొన్నారు. 30 కిలోల బస్తాకు రాయితీపై రూ.1095 ఇవ్వగా, 351 బస్తాలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఈవోలు సుకుమార్, కిరణ్‌కుమార్‌రెడ్డి, నిస్సార్ అహ్మద్, మాజీ సర్పంచ్ హన్మంత్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...