సమస్యలు స్టాడింగ్ కమిటీలో ప్రస్తావించాలి


Tue,June 11, 2019 11:23 PM

- స్టాండింగ్ కమిటీ మెంబర్ అంజయ్యయాదవ్‌కు సూచించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
రామచంద్రాపురం: పటాన్‌చెరు, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్‌ల సమస్యలను స్టాండింగ్ కమిటీలో చర్చించి డివిజన్‌ల అభివృద్ధికి అధిక నిధులు తీసుకురావాలని కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ అంజయ్యయాదవ్‌కు ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిలు తెలిపారు. బల్దియా స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా కార్పొరేటర్ అంజయ్యయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మంగళవారం కార్పొరేటర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల కాలనీల అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్పొరేటర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ మెంబర్‌తో బాధ్యత మరింతగా పెరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్‌కు సూచించారు.

ఆర్సీపురం డివిజన్‌తో పాటు ఇతర డివిజన్‌ల సమస్యలను స్టాండింగ్ కమిటీలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. కార్పొరేటర్ అంజయ్యయాదవ్ స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌కు శివారు ప్రాంతంలో ఉండే పటాన్‌చెరు, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి ప్రత్యేక నిధులు తీసుకురావాలన్నారు. స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా బాధ్యతయుతంగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందిచాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుష్పానగేశ్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీపతి రవీందర్, లకా్ష్మరెడ్డి, కృష్ణవేణి, జగన్నాథ్‌రెడ్డి, పరమేశ్‌యాదవ్, దేవేందర్‌చారి, సత్యనారాయణ, పాపయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...