కేటీఆర్, కవితలను కలిసిన జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ


Mon,June 10, 2019 11:12 PM

అందోల్, నమస్తే తెలంగాణ / పుల్కల్ : జిల్లా పరిషత్ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు, ఎంపీపీ లు సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ ముఖ్య నాయకులను మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం జిల్లా పరిషత్ నూతన చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మండలాల నూత న జడ్పీటీసీలు, ఎంపీపీలు హైదరాబాద్‌కు ప్రత్యేక వాహనా ల్లో బయలుదేరి వెళ్లారు. ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి, పుష్పగుచ్ఛాలు అందజేసి, తమపై నమ్మకంతో టికెట్‌ను కేటాయించినందుకు వారికి ప్రత్యేక కృ తజ్ఞతలను తెలియజేశారు. నియోజకవర్గంలోని జడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ స్థానాలను గెలుచుకున్న మండలాల వివరాలను వారికి వివరించారు. నూతన పాలకవర్గ సభ్యులకు కే టీఆర్, కవిత అభినందనలతో పాటు శుభాకాంక్షలను తెలిపా రు.

మీ అందరిపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రజలకు అం దుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అభివృద్ధి పనులను చేపట్టాలని, సమర్థవంతమైన పాలనను అందించాలని వారు సూచించారు. అనంతరం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ పాటు నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ లు, ఎంపీపీలు కలిశారు. ఆయన వారికి పుష్పగుచ్ఛాలు అం దజేసి, అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు కే.రమేశ్ (అందోల్), డి.సౌందర్య (అల్లాదుర్గం), పి. మీనాక్షి (మునిపల్లి), పత్రి అపర్ణ (వట్‌పల్లి), మల్లికార్జున్ పా టిల్ (రాయికోడ్), ఎంపీపీలు బాలయ్య (అందోలు), చైతన్యరెడ్డి (పుల్కల్), డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ పి.జైపాల్‌రెడ్డి, జా గృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, నాయకులు సాయికుమార్, కా శీనాథ్, నర్సింహరెడ్డి, యాదగిరిరెడ్డి, ప్రభాకర్, మహేశ్‌బాబు, సదానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...