పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల వెల్లువ


Mon,June 10, 2019 11:12 PM

సంగారెడ్డి చౌరస్తా : తమ కుమారుడు 12 ఏండ్ల క్రితం పెం ైడ్లెయిన వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఇప్పుడు త మ కోడలు ఆస్తి కావాలని బెదిరిస్తున్నట్లు అమీన్‌పూర్ వాసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రజా విజ్ఞప్తుల రోజు సందర్భంగా ప్రజలు సోమవారం నేరుగా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను తెలియజేశారు. ఈ క్రమంలో అమీన్‌పూ ర్ వాసి తన ఫిర్యాదును అందజేస్తూ 2007లో తమ కుమారుడికి వివాహం చేశామని తెలిపారు. వివాహం జరిగిన 15 రోజుల అనంతరం తన కుమారుడు గొడవపడి ఇంటి నుం చి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ కోడలు బంధువులతో వచ్చి ఆస్తి తమ పేరుపై రాయాలని లేకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తనకు 2010లో పెండ్లి జరిగి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారని మునిపల్లి మండలానికి చెందిన ఓ ఫిర్యాదురాలు ఎస్పీకి వివరిస్తూ ఇద్దరు పిల్లలలో ఒక కుమారుడి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తన భర్త వేరే వివాహం చేసుకుంటానని, విడాకులు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నారని వివరించారు. తనతో పాటు పిల్లలను కూడా ఇంటి నుంచి వెళ్లగొట్టారని చట్ట ప్రకారం న్యాయం చేయాల్సిందిగా కోరారు.

-తన భార్య ఇచ్చిన అప్పు తీసుకురావడానికి వెళ్లి శవమైందని సదాశివపేటకు చెందిన ఓ ఫిర్యాదుదారుడు ఎస్పీకి వివరించారు. తన బంధువులకు రూ.5లక్షల 50వేలు అప్పుగా ఇచ్చానని, ఆ డబ్బు తిరిగి తీసుకురమ్మని 2017 ఏప్రిల్ 29న తన భార్యను వారికి ఇంటికి పంపించానని పేర్కొన్నారు. డబ్బుల కోసం వెళ్లిన తన భార్య చెరువులో పడి శవమై తేలిందని పేర్కొన్నారు. తన భార్య మరణంపై అనుమానాలు ఉన్నందున చట్ట ప్రకారం విచారణ చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

-ఎస్సీ కులానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కులంపేరుతో దూషించి దాడిచేసి గాయపర్చిన మరో ప్రభుత్వశాఖ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వివిధ సంఘాల నాయకులు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. లేని యెడల ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు. ఆయా ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సంబంధిత ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...