భూసార పరీక్షలతోనే రైతుకు మేలు


Mon,June 10, 2019 11:12 PM

న్యాల్‌కల్ : చాలా మంది రైతులు పంటల సాగుకు కావాల్సిన పోషక విలువలు తమ భూమిలో ఏమాత్రం ఉన్నాయో తెలుసుకోకుండా సాగు చేస్తున్నారు. అధిక దిగుబడులు రావాలని రసాయనిక ఎరువులు కూడా విచ్చిలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఖర్చు పెరుగడం తప్ప దిగుబలో అశించిన మేర ఫలితాలు కనిపించడం లేదు. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరుగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి అని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని కాకిజనవాడ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి వ్యవసాయాధికారులు మట్టి నమూనాల సేకరణ చేపట్టారు. మండలంలోని గ్రామాల్లో ఎర్ర భూములతో పాటు చవుడు, నల్లరేగడి నేలలు ఉన్నాయి. అధిక దిగుబడులు సాధించాలని రైతులు రసాయన ఎరువులను మితిమీరి వినియోగిస్తున్నారు. వీటి కారణంగానే సాగు ఖర్చు పెరిగిపోవడంతో పాటు కాలుష్యం, చౌడు తదితర సమస్యలు తలెత్తడంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. భూసార పరీక్షల ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. అంతే కాకుండా వేసిన ఎరువుల పట్ల పంటలకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసార పరీక్షల కోసం సేకరించిన మట్టిని ప్రయోగశాలకు పంపి, భూమిలో భౌతిక, రసాయన పద్ధతిలో విశ్లేషించి నేల స్వభావం, లక్షణాలను తెలుసుకోవడమే భూసార పరీక్ష ఫలితాల అధారంగానే ఏ పంట సాగు చేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలుస్తుంది. పరీక్ష ద్వారా రైతులు దిగుబడిలతోపాటు ఖర్చు కూడా తగ్గుతోంది. అంతేకాకుండా పొలంపై రైతుకు అవగాహన ఉంటుంది.

రసాయన ఎరువులు తగ్గించాలి
రసాయన ఎరువులు అధికం గా వాడకం వల్ల పంట దిగుబడి రాదు. భూసార పరీక్షల అధారంగా ఎరువులు వా డాలి. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూసారం పె రుగుతుంది. భూసార పరీక్షలలో ఏ మేరకు ఎరువులు, ఏ పంట సాగు చేసుకోవాలో తెలుస్తుంది. పరీక్షలు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. తద్వారా మంచి దిగుబడి వస్తుంది.
- టీమోటీ, ఏఈవో, న్యాల్‌కల్

భూసార పరీక్షలతో ప్రయోజనాలు అనేకం...
భూసార పరీక్షలతో ప్రయోజనలు అనేకం ఉంటాయి. ఏ పంటలు వేసుకోవాలో తెలుసుకోవచ్చు. భూమి స్వభా వం ఏమేర ఏ పంట సాగు చేసుకోనే విషయాలు తెలుస్తాయి. పంట సాగు చేయక ముందు ప్రతి రైతు భూసార పరీక్షలు చేసుకుంటే ఎంతో ఉపయోగంగా కూడా ఉంటుంది.
- నర్సింహారెడ్డి, రైతు, మామిడ్గి

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...