అటవీ ప్రాంతాన్ని కాపాడుకుందాం..


Mon,June 10, 2019 11:12 PM

-చెట్లను నరికితే కేసులు నమోదు..
-ప్రజలకు అవగాహనతో మేలు
కోహీర్ : ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు స్వచ్ఛమైన గాలి ఎంతో అవసరం. చెట్ల నుంచి జీవరాశులకు స్వచ్ఛమైన వాయువు లభిస్తుంది. జీవరాశుల మనుగడ కూడా చెట్ల పెంపకంపైనే అధారపడి ఉన్నది. చెట్లను నరికితే మాత్రం స్వ చ్ఛమైన గాలి దొరుకదు. ప్రజలు అనారోగ్యాల ను కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుం ది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభు త్వం హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టడంతో పాటు అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు సత్వర చర్యలు చేపట్టింది. మండలంలోని బడంపేట, సజ్జాపూర్, గొటిగార్‌పల్లి, తదితర గ్రామాల ప్రజలకు ఇటీవల అటవీ శాఖ ఆధ్వర్యంలో చెట్ల నరికివేత, నిప్పుపెట్టడం తదితర అంశాలపై అవగాహన కలిగించారు.

అటవీ ప్రాంతంలోని చెట్లను నరికితే ఫారెస్టు 1967, పీడీపీపీ 1984 చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రజలకు వివరించారు. దీంతో ప్రజల మదిలో ఆలోచన ప్రారంభమైంది. చెట్ల నరికివేతతో కలిగే అనర్థాలను తెలుసుకున్నారు. తమ భవిష్యత్ జీవనం కోసం చెట్లను కాపాడుతామని స్పష్టీకరిస్తున్నారు. చెట్లు లేకపోతే తమకే నష్టం జరుగుతుందని గ్రహించారు. మొత్తానికి అటవీ శాఖ ఆధికారులు ఆయా గ్రామాల ప్రజలకు చేపట్టిన అవగాహన సమావేశాలు సత్ఫలితాలనిస్తున్నాయి. చెట్ల నరికివేత కొంత మేరకు తగ్గింది. పూర్తిగా అరికడితేనే జీవరాశుల మనుగడ కొనసాగుతుంది. చెట్లను నరకడం, నిప్పు పెట్టడం చేస్తే మాత్రం మానవులు, జంతువుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. చెట్ల నరికివేత, నిప్పు పెట్టడం తదితర అంశాలపై మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరికీ అటవీ శాఖ చట్టాల గురించి అవగాహన కలిగిస్తేనే అటువైపునకు ఎవరు కూడా కన్నెత్తి కూడా చూడరు. సంబంధిత అటవీ శాఖాధికారులు ఎంతవరకు సఫలీకృతం అవుతారో వేచిచూడాల్సిందే.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...