సోయాబీన్ విత్తనాల పంపిణీ


Mon,June 10, 2019 11:12 PM

న్యాల్‌కల్ : మండలంలోని హద్నూర్, న్యాల్‌కల్ గ్రామాల్లో రైతులకు సో యాబీన్ విత్తనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చే సిన సోయాబీన్ విత్తనాలను సోమవారం హద్నూర్ పీఏసీఎస్, న్యాల్‌కల్ ఉమర్ ఫర్టీలైజర్ దుకాణాల్లో మండల వ్యవసాయాధికారి లావణ్య, హ ద్నూర్ పీఏసీఎస్ చైర్మన్ జగన్నాథ్‌రెడ్డిలు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానకాలం సీజన్‌లో సాగుచేసేందుకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్న సోయాబీన్ విత్తనాలను రైతులను సద్వినియోగం చే సుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు సాయిలు, మమత, నిఖిత, షరీఫ్, మహేశ్, మాధవి, పీఏసీఎస్ కార్యదర్శి సంతోశ్ కుమార్ పాల్గొన్నారు.

కోహీర్‌లో...
కోహీర్ : మండలంలోని ఆయా గ్రామాల రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్నామని మండల వ్యవసాయాధికారి నవీన్‌కుమార్ తెలిపారు. సోమవారం కోహీర్ పట్టణంలోని తన కార్యాలయంలో విత్తనాల పంపిణీ కోసం అనుమతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమయ్యే విత్తనాలను కోహీర్‌లోని గ్రోమోర్ కేంద్రంలో పంపిణీని ప్రారంభించామన్నారు. 40 కిలోల జనుములకు రూ.960, 30 కిలోల జీలుగలకు రూ.540, 30 కిలోల సోయాబీన్ రూ.1095, మొక్కజొన్నల విత్తనాల్లో 2288రకం 5కిలోలు రూ.700, 3696 రకం 4కిలోలకు రూ.500 రైతులు చెల్లించాలన్నారు. రైతులు తమ కొత్త పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్సులను అందించి అనుమతి పత్రాలను పొందాలన్నారు. ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...