నర్సరీల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి


Mon,June 10, 2019 11:12 PM

ఝరాసంగం : నర్సరీలో పెరుగుతున్న మొక్కలపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో మారుతి విఠోబా సూచించా రు. సోమవారం ఝరాసంగంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురిసే వరకు గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుం డా చూసుకోవాలన్నారు. అలాగే ప్రతి గ్రామాల్లో మిగిలిపోయిన మరుగుదొడ్లను పూర్తి చేసి వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా కార్యదర్శులు స్థానికంగా ఉంటూ నర్సరీలో పెరుగుతున్న మొక్కలను పరిశీలించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, చెరువు గట్లు, సశ్మాన వాటికి, ప్రతి ఇంటి పెరట్లో మొక్కలను నాటేందుకు మొక్కలను పెంచాలని కార్యదర్శులకు సూచించారు. సమావేశంలో ఏఈ సృజన్ ఏపీవో రాజ్‌కుమార్, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...