క్రీడాకారులకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం


Mon,June 10, 2019 11:11 PM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ: పంజాబ్ రాష్ట్రం మొహాలీలో జరిగే దివ్యాంగుల వీల్ చైర్ జాతీయ పోటీల్లో పాల్గొననున్న క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి రూ.1.50లక్షలు అందజేశారు. సోమవారం పటాన్‌చెరు పట్ణణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల వీల్ చైర్ క్రీడాకారులు కలిశారు. వారికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తన సొంత ఖర్చు రూ.1.50లక్షలతో విమానంలో మొహాలీకి పంపిస్తున్నారు. ఈ మేరకు దివ్యాంగ క్రీడాకారులకు నగదును అందించారు. అనంతరం ఎమ్మెల్యే దివ్యాంగ క్రీడాకారులను ఛాంపియన్లుగా గెలిచి తెలంగాణకు మంచి పేరును తీసుకురావాలని కోరారు. దివ్యాంగులు శారీరకంగా దేనికి తీసుపోరని నిరూపించాలని సూచించారు. పట్టుదలగా వీల్ చైర్ క్రీడాకారులుగా రాణిస్తున్నారని వారిని కొనియాడారు. ఇక మీదట జరిగే దివ్యాంగుల క్రీడా పోటీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కే. సత్యనారాయణ మాట్లాడుతూ దివ్యాంగ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటి ప్రతిభతో మంచి విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో జరిగే అన్ని పోటీల్లోను పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కుమార్‌యాదవ్, ఆదర్శ్‌రెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...