మున్సిపల్‌లో నిబంధనలు తూచ్..!


Sun,May 26, 2019 11:12 PM

జహీరాబాద్,నమస్తే తెలంగాణ : జహీరాబాద్ పట్టణంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య జఠిలమవుతుంది. కొత్తగా నిర్మించే భవనాలకు నిబంధనలను కచ్చితంగా అమలు చే యాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఫలితం గా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు నెలకుంటున్నాయి. ట్రాఫి క్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు పట్టంచుకోవడం లేదు. బ్లాక్ రోడ్డు, భవానీ మందిర్, హనుమన్ మం దిర్, తహసీల్దార్ కార్యాలయం రోడ్లపై ట్రాఫిక్ సమస్య తీవ్ర నెలకొన్నది.

సెట్ బ్యాక్ నిబంధనలివీ...
ఫ్లాట్ సైజ్, భవనం ఎత్తును బట్టి భవనం ముందు సెట్ బ్యా క్ వదులాలి. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఒక్కో భవనానికి ఒక్కో నిబంధన ఉంది. సెట్‌బ్యాక్‌లో 50 చదరపు మీటర్ల వరకు ఒక ని బంధన, 50-100 చదరపు మీటర్లకు మరో నిబంధన ఉం ది. రహదారిలో ఒక అపార్ట్‌మెంట్ నిర్మించాలంటే 10.6 అడుగుల సెట్‌బ్యాక్‌ను నలువైపులా వదలాల్సి ఉంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో నిబంధనలు వేరుగా ఉంటాయి. కనీ సం 1.5 మీటర్ల నుంచి 7.5 మీటర్ల వరకు సెట్ బ్యాక్ వదలాల్సి ఉంటుందని మున్సిపల్ అధికారులు తెలుపుతున్నారు.

మున్సిపల్‌లో నిబంధనలకు తూట్లు ఇలా...
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన రోడ్డులో నిర్మిస్తున్న భవనాలు సెట్‌బ్యాక్ నిబంధనలకు తూట్లు పోడుస్తున్నారు. మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో సెట్‌బ్యాక్ లేకుండానే ఇండ్లు, వ్యాపార సంస్థల భవనాల సముదాయాలు నిర్మిస్తున్నారు. బ్లాక్ రోడ్డు, హనుమన్ మందిర్, భవానీ మందిర్ రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారు.

జహీరాబాద్‌లో పరిస్థితి ఇదీ...
మున్సిపల్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న భవనాలు సెట్‌బ్యాక్ నిబంధన అమలు చేయని పరిస్థితి నెలకుంది. వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతల్లో భవనాలు నిర్మించే వారు నిబంధనలు పట్టించుకోవడం లేదు. జహీరాబాద్‌లో వ్యాపార కేంద్రాలు ఉన్న రోడ్డులో నిర్మిస్తున్న భవనాలు చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ నాయకుల ఒత్తిడి ఒక కారణమైతే అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. భవనాలకు సెట్‌బ్యాక్‌లు లేకుండా అంతస్తులకు అంతస్తులు అనుమతిస్తే పార్కింగ్ ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త భవనాల వల్ల ట్రాఫిక్ సమస్య పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు...
పట్టణంలో సాయంత్రం వేళ ఒక ఆడుగు ముందుకు వెయ్యాంటే ఆడుగడుగునా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుడం లేదు. పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండగా తాజాగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాలతో ఈ సమస్య మరింత జఠిలమవుతుంది. మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోతే సమస్య మరింత పెరుగుతుంది. మున్సిపల్ అధికారులు సెట్‌బ్యాక్ నిబంధనలు కచ్చతంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...