పరిహారం తీసుకోకపోతే నష్టపోతారు


Sun,May 26, 2019 11:12 PM

తొగుట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణతో పాటు ఆర్‌ఆండ్‌ఆర్ ప్యాకేజీ, ఇండ్లు, ఇంటి ఆస్తుల పరిహారం పంపిణీ దాదాపు పూర్తిస్థాయికి చేరిందని సిద్దిపేట ఆర్డీవో మేకల జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ బాధితులకు ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఏర్పాటుకు ఆదివారం మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి శివారులో నాలుగు ఎకరాల భూమిని తొగుట తహసీల్దార్ వీర్‌సింగ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం 17,467 ఎకరాలను సేకరించామని, కేవలం 123 ఎకరాల భూమి మాత్రమే మిగలగా, వారి పేర కోర్టులో పరిహారాన్ని డిపాజిట్ చేసినట్లు చెప్పారు. కొందరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఇంటి సర్వేకు అడ్డు పడుతున్నారన్నారు. ఉత్తర తెలంగాణ సస్యశామలానికి ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, త్యాగం చేస్తున్న ముంపు బాధితులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు.

పరిహారం నిరాకరణ భావ్యం కాదు..
ముంపు బాధితులకు మెరుగైన పరిహారం ఇస్తున్నామని, వేములఘాట్‌లో 30 మంది వరకు ఇండ్లు, ఇంటి స్థల సర్వేను అడ్డుకుంటూ పరిహారం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని ఆర్డీవో తెలిపారు. ముంపు బాధితులు ప్యాకేజీ తీసుకొని సంతోషం వ్యక్తం చేస్తుంటే, కొద్ది మంది మాత్రం నిరాకరించడం భావ్యం కాదన్నారు. ప్రాజెక్టు బాధితుల చరిత్రలో ఎక్కడా కూడా ఇంటికి వెళ్లి, పరిహారం చెక్కులు ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఇక్కడ మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. అధికారులు ఇప్పటికే పలుమార్లు ఇంటి సర్వే కోసం పరిహారం తీసుకోవడానికి నిరాకరిస్తున్న వారికి నచ్చజెప్పామన్నారు. పెద్ద మనసుతో పరిహారం తీసుకోవాలని, ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ నెల 30లోగా పరిహారం తీసుకోనివారికి తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి శివారులో నాలుగు ఎకరాల స్థలంలో ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పారు. తలా 60 గజాల ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.2.20 లక్షలు మాత్రమే ఇస్తారని చెప్పారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...