పక్షుల సంరక్షణ మనందరి బాధ్యత


Sun,May 26, 2019 11:12 PM

సంగారెడ్డి రూరల్ : పర్యావరణ హితంలో భాగంగా పక్షులను వాటి జాతులను సంరక్షించాల్సిన అవసరం అందరిపై ఉందని జిల్లా అటవీ శాఖాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి మండలం కలబ్‌గూర్‌లోని మంజీరా పర్యాటక విజ్ఞాన కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో వేంకటేశ్వరరావు మాట్లాడుతూ గాలిపటాలను ఎగురవేయడానికి ఉపయోగించే చైనా మాంజా వలన పక్షులు ఏవిధంగా చనిపోతున్నాయో సభ్యులకు వివరించారు. చైనా మాంజాను నిషేధించి పక్షులను రక్షించుకోవాలని, మంజీరా అభయారణ్యంలో గల సుమారు 285 రకాల పక్షి జాతులను రక్షించాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు. అనంతరం హైదరాబాద్ బర్డింగ్ పాల్‌కు చెందిన హరికృష్ణ మాట్లాడుతూ పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తినడం ద్వారా పక్షులు ఏ రకంగా రైతులకు మేలు చేస్తున్నాయో వివరించారు. పక్షులను కాపాడడంలో గ్రామస్తులు ముందుండాలని కోరారు. కార్యక్రమంలో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డుకు చెందిన డాక్టర్ సాయిలు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...