సబ్సిడీపై ఎరువులు విత్తనాలు అందించాలి


Sat,May 25, 2019 11:58 PM

సంగారెడ్డి చౌరస్తా: జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాలు క్రియాశీలకంగా ఉంటూ రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలను అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ నిఖిల ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో జిల్లాలోని సహకార సంఘాల సీఈవోలతో జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలను విక్రయించాలని స్పష్టం చేశారు. అన్ని సహకార సంఘాలలో విత్తన, ఎరువుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఈ-పాస్ యంత్రాల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీబీటీ కో-ఆర్డినేటర్ మయాంక్, మాస్టర్ ట్రైనర్ రాజవర్ధన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు, జిల్లా సహకార శాఖ అధికారి ప్రసాద్, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...