నర్సరీ మొక్కలు పరిశీలన


Sat,May 25, 2019 11:58 PM

ఝరాసంగం: ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కల నిర్వహణ సక్రమంగా ఉండాలని డీఆర్డీవో శ్రీనివాసరావు నిర్వాహకులకు సూచించారు. శనివారం మండలలోని ఏడాకులపల్లి, జీర్లపల్లి, బొరెగావ్, బొప్పన్‌పల్లి గ్రామ శివార్లలో ఉపాధిహామీ ఆధ్వర్యంలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమంలో .. మరో విడుత మొక్కల పెంపకానికి అధికారులు సన్నద్ధం కావాలన్నారు. ఇప్పటికే జిల్లాలో నాలుగు విడుతల్లో పెద్దమొత్తంలో మొక్కలు నాటగా, ఐదో విడుత హరితహారంలో భాగంగా 2.22 కోట్ల మొక్కలు పెంచేందుకు టార్గెట్ ఉండగా, అందులో 1.32 కోట్ల మొక్కలు పెంచుతున్నామన్నారు. జిల్లాలోని 466 నర్సరీల్లో ఇప్పటికే మొక్కలు పెంచగా, వాటిలో 80శాతం ఎదుగుదల ఉంది. మండలంలో 28నర్సరీలో 9.3 లక్షలు మొక్కలు నర్సరీలో పెరుగుతున్నాయని ఆయన వివరించారు. రైతుల పొలాలు, గట్లపై నాటేందుకు వీలుగా.. ఈసారి 40 శాతం టేకుమొక్కలు పెంచేందుకు కార్యాచరణను రూపొందించారు. వర్షా లు కురిసిన వెంటనే మొక్క లు నాటేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే శాఖల వారీగా నాటే మొక్కల లక్ష్యా న్ని నిర్ణయించగా.. మొక్కలు నాటే ప్రాం తాలను ఎంపిక చేస్తున్నారు. నర్సరీలో సీమారోబా, వేప, టేకు, గుల్‌మోర్, జామ, ఖజురా, మొక్కలను పెంచడం జరిగిందన్నారు. రోడ్డుకు ఇరుపక్కలా నాటే మొక్కలకు ట్రీగార్డులు ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క దానికి రూ.139 ఉంటుందన్నారు. మిగతా మొక్కలకు ముళ్లకంచె ఏర్పాటు చేస్తామన్నారు.

ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష..
విధి నిర్వహణలో ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా డీఆర్‌డీవో శ్రీనివాసరావు స్ప ష్టం చేశారు. మండలపరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొప్పన్‌పల్లి, బొరెగావ్ గ్రామాల్లో నర్సరీలో మొక్కలు పెంచడంలో ఫీల్డ్‌అసిస్టెంట్లు నిర్లక్ష్యంగా పనిచేయడం వల్ల నర్సరీలో పెంచుతున్న మొక్కల్లో 10 శాతం లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 20రోజుల్లో మొక్కలు పెంచాలని ఫీల్డ్‌అసిస్టెంట్లను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. నర్సరీల పెంపకాన్ని చూడాల్సిన బాధ్యత ఉపాధి జేఈ ప్రతాప్‌రెడ్డి, బొరెగావ్, బొప్పన్‌పల్లి గ్రామాల్లో నర్సరీల పెంపకానికి ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలియజేశారు. మండల నర్సరీల్లో మొక్కల ఎదుగుదల ఉండాలని లేనిపక్షంలో అన్ని నర్సరీలు పరిశీలిస్తానన్నారు. వచ్చే వానకాలం కల్లా అన్నీ నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెంచాల్సిన బాధ్యత ఫీల్డ్‌అసిస్టెంట్లు, ఏపీవోదేనన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఏపీడీ సీహెచ్ ఎల్లయ్య, ఏపీవో రాజ్‌కుమార్, ఏపీఎం బాలకృష్ణ, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...