కొత్త పాఠ్య పుస్తకాలొచ్చాయి


Sat,May 25, 2019 11:57 PM

-మండలంలోని సర్కార్ పాఠశాలల్లో 9390 మంది విద్యార్థులు
అందోల్, నమస్తే తెలంగాణ: 2019-20 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థినీ, విద్యార్థులకు అందించేందుకు కొత్త పాఠ్య పుస్తకాలొచ్చాయి. జోగిపేటలోని ఎంపీపీ కార్యాలయంలోని ఎంఆర్‌సీ కార్యాలయానికి శనివారం పాఠ్య పుస్తకాలు చేరాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానుండడంతో విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను అందించేందుకు ముందస్తుగా సిద్ధం చేశారు. మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 10, ప్రాథమికోన్నత 06, ప్రాథమిక 28, మోడల్ స్కూల్ 01, గురుకుల పాఠశాల 01, మైనార్టీ పాఠశాలలు 02, కేజీబీవీ 01, జ్యోతిరావు ఫూలే 01 పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 9390 మంది విద్యార్థినీ, విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి పాఠ్యపుస్తకాలను అందించేందుకు సరిపడా పుస్తకాలను విద్యాశాఖ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాలకు సంబంధించి వేర్వురుగా పాఠ్య పుస్తకాలను పంపించింది. పాఠశాలల వారీగా, తరగతుల వారీగా విద్యార్థినీ, విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠ్య పుస్తకాలను ఆయా పాఠశాలలకు పంపించడం జరుగుతున్నదని ఎంఈవో కృష్ణ తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా జూన్ 1 నుంచి పునః ప్రారంభం కావాల్సి ఉండగా, జూన్ 12 నుంచి పాఠశాలలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...