వైదిక పాఠశాల విద్యార్థులకు శిక్షణా తరగతులు


Sat,May 25, 2019 11:57 PM

ఝరాసంగం : మండల పరిధిలోని బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమంలో శనివారం వైదిక పాఠశాల విద్యార్థులకు ఆశ్రమ బావిపీఠాధిపతి సిద్ధేశ్వరనందగిరి మహారాజ్ వైదిక పాఠశాల విద్యార్థులకు వేదలను చదివిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన అలవర్చుకోవాలన్నారు. ఇలాంటి మా రు మూల ప్రాంతంలో వైదిక పాఠశాల ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రస్తు త తరుణంలో పురోహితుల సంఖ్య చాలా తక్కువ ఉంద ని విద్యార్థులు వైదిక విద్యను శ్రద్ధగా నేర్చుకుని భావి పురోహితులుగా ఎదుగాలని విద్యార్థులకు సూచించారు. ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్యశిఖమణి అవధూతగిరి మహారాజ్ ముందుచూపుతో ఇలాంటి పాఠశాల ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వైదిక విద్యను నేర్చుకోవడానికి కులం, మతం అడ్డుకాదన్నారు. విద్యార్థులు చిన్న వయస్సులో ఉన్నప్పుడే క్రమశిక్షణతో కూడిన సంస్కృతిని అలవర్చుకోవాలన్నారు. వచ్చే నెల జూన్ 4వ తేదీన వేదలను నేర్చుకునే కొత్త విద్యార్థుల కోసం దరఖాస్తుల చేసుకోవాలని ఆశ్రమ సిబ్బంది నందిని కోరారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...