కార్యదర్శిపై అసత్య ప్రచారాలు మానుకోవాలి


Sat,May 25, 2019 11:57 PM

రేగోడ్: రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌పై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను వెంటనే మానుకోవాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు నరేశ్ కోరారు. శనివారం మండల పరిధిలోని గజ్వాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురుకులాల అభివృద్ధి, ప్రవేశాల కోసం కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. గురుకులాల్లో ఏవైనా పొరపాట్లు జరిగితే తాము వెంటనే ఎత్తి చూపుతామని చెప్పారు. విద్యార్థుల ఉన్నతి కోసం పాటు పడుతున్న కార్యదర్శిపై కర్నె శ్రీశైలం చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్వరోస్ సంస్థను విమర్శించడం సరి కాదని అసత్య ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఆకాశ్, కీర్తికుమార్, అరవింద్, గోపాల్, కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...