రికార్డులను సక్రమంగా నిర్వహించాలి


Sat,May 25, 2019 11:57 PM

కోహీర్ : డ్వాక్రా సంఘాల మహిళలకు అందించిన స్త్రీనిధి, బ్యాంకు రుణాల వివరాలను రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని ఐకేపీ ఏపీఎం సమ్మయ్య కోరారు. శనివారం కోహీర్ పట్టణంలోని ఐకేపీ-పేదరిక నిర్మూళన సంస్థ కార్యాలయంలో డ్వాక్రా సంఘాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం సమ్మయ్య మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల లావాదేవీల వివరాలను తప్పులు లేకుండా రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన సంఘాలకు మాత్రమే మరోసారి మంజూరు చేయించాలన్నారు. స్త్రీనిధి, బ్యాంకు రుణాలతో మహిళలు అభివృద్ధి చెందాలన్నారు. సమావేశంలో సీసీలు గోపాల్, హనుమంతు, అంజయ్య, తదితరులు ఉన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...