ఫార్మేషన్ రోడ్డు ప్రారంభం


Sat,May 25, 2019 11:56 PM

సిర్గాపూర్: మండలంలోని ఖాజాపూర్‌లో కొత్తగా ఫార్మేషన్ రోడ్డు వేసేందుకు శనివారం పనులను గ్రామ సర్పంచ్ లచ్చానాయక్ ప్రారంభించారు. బీటీ రోడ్డు నుంచి రెండు కిలోమీటర్ల పొడవున చింతలగడి హనుమాన్ మందిరం వరకు రహదారి అభివృద్ధి కోసం ఫార్మేషన్ పనులు మొదలుపెట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కృషితో ఈ రహదారి అభివృద్ధికిగాను రూ.5లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో కురుమ సంఘం మండల అధ్యక్షుడు హన్మాండ్లు, తుకారం మహరాజ్, అడివయ్య, నజీర్‌పటేల్, స్థానికులు తదితరులున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...