టీఆర్‌ఎస్ విజయోత్సవ సంబురాలు


Sat,May 25, 2019 12:19 AM

-ఎంపీ బీబీ పాటిల్ గెలుపుతో అందోలు మరింత అభివృద్ధి
అందోల్, నమస్తే తెలంగాణ: జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీబీ పాటిల్ రెండోసారి గెలుపొందడంపై జోగిపేటలోని టీఆర్‌ఎస్ శ్రేణులు విజయోత్సవ సంబురాలను నిర్వహించారు. శుక్రవారం జోగిపేటలోని జోగినాథ్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై పటాకులను కాల్చారు. అనంతరం నాయకులు ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుని, పట్టణంలో పంచి పెట్టారు. జై కేసీఆర్...జైజై కేసీఆర్...బీబీ పాటిల్ జిందాబాద్...జై క్రాంతన్న అంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ.నాగభూషణం, ఆత్మగౌరవ కమిటీ కన్వీనర్ డి.వీరభద్రరావు, వైస్ ఎంపీపీ రమేశ్, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు చాపల వెంకటేశం మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని, ఆయన ప్రవేశపేట్టిన సంక్షేమ పథకాలతోనే బీబీ పాటిల్ విజయం సాధించారన్నారు. నియోజవర్గంలో ఎంపీ నిధులతో బీబీపాటిల్ అనేక విధాలుగా అభివృద్ధి పనులను చేపట్టారని, మరోసారి ఎంపీగా గెలువడంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి పరుచుకునేందుకు అవకాశం దక్కిందన్నారు. బీబీ పాటిల్ గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్త, నాయకులకు ధన్యవాదాలను తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గాజుల నవీన్, పులుగు గోపాల్ రావు, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఖాజాపాషా, మాజీ సర్పంచ్ శంకరయ్య, నాయకులు శ్రీనివాస్ యాదవ్, గాజుల అనిల్, మహేశ్ యాదవ్, శంకర్ యాదవ్, నాగరాజ్, ఫైజల్, జావేద్, డాకూరి గణేశ్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.

మోదీ పాలనతోనే రెండోసారి అధికారం
అందోల్, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపేట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు చేయడం...దేశ వ్యాప్తంగా అవినీతి రహిత పాలనను అందించిన నరేంద్ర మోదీకి దేశ ప్రజలు రెండోసారి అఖండ విజయాన్ని అందించారని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఆర్.ప్రభాకర్‌గౌడ్ అన్నారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో శుక్రవారం బీజేపీ నాయకులు జోగిపేటలో సంబురాలను చేసుకున్నారు. ఈ సందర్భంగా జోగిపేటలోని జాతీయ రహదారిపై పటాకులను కాల్చి, ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలోనే దేశానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మోదీపై ఉన్న నమ్మకంతోనే దేశ ప్రజలు మరోసారి బీజేపీకి అవకాశాన్ని కల్పించారని ఆయన అన్నారు. కార్యక్రమంలో అందోలు అసెంబ్లీ కన్వీనర్ ప్రభాత్‌కుమార్, జిల్లా కార్యదర్శి జగన్నాథం, పట్టణ అధ్యక్షుడు సతీశ్, జిల్లా కిసాన్ మోర్చ కార్యదర్శి మాణయ్య, నాయకులు ప్రేమ్ సాగర్, నరేశ్, రమణ, ఆంజనేయులు, కిశోర్, నర్సింహులు, తదితరులు ఉన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...