పాపకు పట్టగొలుసులు అందజేసిన డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి


Sat,May 25, 2019 12:19 AM

సంగారెడ్డి రూరల్ : ఈ నెల 7న సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానాలో సంగారెడ్డి మండలం కలబ్‌గూర్ గ్రామానికి చెందిన మాధవి, మల్లేశం దంపతుల ఎనిమిది రోజులు నిండిన పాపన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన సంఘటన విదితమే. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే నిందితులిద్దరని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే ఆ పాప ఆరోగ్య సరిగా లేకపోవడంతో చిన్నారిని హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అదించారు. కాగా శుక్రవారం పాప బారసాల ఉన్నది తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ వెంకటేశ్‌లు స్వయంగా వారి ఇంటికి వెళ్లి చిన్నారి పట్టు గొలుసులు, కొత్త దుస్తులను అందజేశారు. అనంతరం పాప ఆరోగ్యం ఎలా ఉందని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ సహకారం అందిస్తామని ఆ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. తమ పాపను ఎత్తుకెళ్లిన నిందితులను పోలీసులు రెండు రోజుల్లోనే పట్టుకుని తమకు అప్పగించారని, ఇప్పుడు పాపకు కొత్త దుస్తులు, పట్టగొలుసు ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారని చిన్నారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...