స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్


Sat,May 25, 2019 12:18 AM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ : జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని ఆర్‌ఆర్‌ఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లను ఆయన జడ్పీసీఈవో రవితో కలిసి పరిశీలించారు. ఏర్పాట్ల తీరుపై ఆయన ఆరా తీశారు. సీసీ కెమెరాల సైన్‌బోర్డుల ఏర్పాటు, సమాచార కేంద్రం తదితర అంశాలను ప్రస్తావించి అధికారుల వద్ద వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల జడ్పీటీసీలకు పోలైన ఓట్లను ఇక్కడ లెక్కిస్తున్నారని పటాన్‌చెరు ఎంపీడీవో అనంతరెడ్డి చెప్పారు. పటాన్‌చెరులోని 19 ఎంపీటీసీ స్థానాలకు, అమీన్‌పూర్‌లోని 3, గుమ్మడిదలలోని 10, జిన్నారంలోని 8 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలను కౌంటింగ్ ఉంటుందని వివరించారు. ఒక్కోక్క ఎంపీటీసీ కౌంటింగ్‌కు రెండు టేబుల్స్ ఏర్పాటు చేస్తామని ఎంపీడీవో తెలిపారు. టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక ఆర్వో, ఒక ఏఆర్వో ఉంటారన్నారు. జడ్పీటీసీకి మండల ఆర్వోలు ఉంటారన్నారు. అదనపు సిబ్బందిని డిప్యుటేషన్‌పై జిల్లా అధికారులు కేటాయిస్తున్నారని వారి వివరాలు కలెక్టర్‌కు దృష్టికి తీసుకుని వచ్చారు. ఎన్నికలను సజావుగా నిర్వహించామని కలెక్టర్ అధికారులతో అన్నారు. ఎన్నికల ఫలితాలను కూడా పారదర్శకంగా లెక్కిస్తే మనం విజ యం సాధించనట్టు అవుతుందన్నారు. పర్మిషన్‌లు ఉ న్నవారినే లోనికి అనుమతి ఇవ్వాలని, ఖచ్చితంగా ని బంధనలను అమలు చేయాలని ఆదేశించారు. ఎప్పటి ఫలితాలను అప్పుడే జిల్లా కేంద్రానికి సమాచారం ఇ వ్వాలని వారికి సూచించారు. ఎలాంటి ఫిర్యాదులు ఉ న్నా తక్షణం పరిష్కరించాలని, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నా రు. కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో శ్రీను, జిన్నారం ఎంపీడీవో మల్లారెడ్డి, ఏఈపీఆర్ సురేశ్‌బాబు తదితరులు పాల్గోన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...