పంచవటీలో కొనసాగుతున్న అతిరుద్రమహాయాగం


Sat,May 25, 2019 12:18 AM

న్యాల్‌కల్ : మండల పరిధిలోని రాఘవాపూర్ పంచవటీ క్షేత్రంలో వర్షాల కోసం చేపట్టిన అతిరుద్రమహాయాగం శుక్రవారానికి రెండో రోజుకు చేరింది. స్థానిక క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో శ్రీశైలం వేదపండిత గురుకుల పాఠశాల ప్రధాన శిక్షకుడు మల్లయ్యస్వామి పర్యవేక్షణలో సరస్వతీదేవి, సాయిబాబా, సూర్యభగవాన్ ఆలయాల్లో విగ్రహాలకు ఉదయం సంకల్ప స్నానం, గోపూజ, యాగశా ల శుద్ధి, అభిషేకం, స్థాప్య, స్థాపిత దేవతాపూజ, హారతి, గణపూజ, అతిరుద్రమహాయాగం, మహా హారతి, ఆ శీర్వచన పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు జ్యోతిర్లింగాలకు రుద్రాభిషేకం, హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు. బిచ్‌కుంద సంస్థాన్‌కు చెందిన సోమాయప్ప మహరాజ్, అంగడిపేటకు చెందిన సచ్చిదానంద సద్గురు ఉద్ధవభావ మహరాజ్‌లు పాల్గొని భక్తులకు ప్రవచనాలకు అందించారు. ఈ నేపథ్యం లో పలువురు భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా, పలు ప్రాంతాల స్వామీజీలు, భక్తులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...