సాధనతోనే నైపుణ్యం సమకూరుతుంది


Wed,May 22, 2019 11:28 PM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ: సాధనతోనే నైపుణ్యం సమకూరుతున్నదని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ అన్నారు. బుధవారం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో ఇంటర్ పర్సనల్ అండ్ ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే అంశంపై గీతం సహాయ సిబ్బందికి పదిరోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిలో రాణించడానికి తగిన శిక్షణ అవసరమని, ఏదైనా ఒక కొత్త విద్యను నేర్చుకుంటే అది మన జీవితంలో ఎప్పుడైనా ఉపకరించవచ్చని పాండవుల అజ్ఞాతవాసాన్ని ఉటంకిస్తూ చెప్పారు. అవకాశం ఉన్నప్పుడు కొత్త అంశాలను తెలుసుకోవాలని, నిబద్ధత, ఏకాగ్రతలతో వాటిని గ్రహించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వృత్తి జీవితంలో రాణించాలని ప్రొఫెసర్ శివప్రసాద్ సూచించారు. నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, భావప్రకటనా నైపుణ్యాలను అలవర్చుకుంటే చెప్పదలచుకున్న అంశాన్ని సూటిగా, స్పష్టంగా ఎదుటి వారికి అర్థమయ్యేలా వివరించవచ్చని ఆత్మీయ అతిథిగా పాల్గొన్న గీతమ్ రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ అన్నారు. కార్యక్రమంలో ఆంగ్ల విభాగం అధ్యాపకులు డాక్టర్ కేవీ మాధవి, డాక్టర్ అమిత్ కుమార్, డాక్టర్ ఎస్ మండల్ తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...