నేటి నుంచి పంచవటీ క్షేత్రంలో యాగం


Wed,May 22, 2019 11:28 PM

న్యాల్‌కల్: మండలంలోని రాఘవాపూర్ గ్రామ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రంలో వర్షాల కోసం అతిరుద్ర మహాయాగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ నెల 23 నుంచి 31వ వరకు పంచవటీ క్షేత్రంలో అతిరుద్ర మహాయాగం కొనసాగనున్నది. స్థానిక పంచవటీ క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో 80 మంది వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య లింగాలను 1800 రుద్రభిషేకాలు, 1800 యజ్ఙహోమాలను నిర్వహించనున్నారు. ఇందు కోసం క్షేత్రం ఆవరణలో 8 జ్యోతిర్లింగాలు, యజ్ఞాల కోసం 9 హోమగుండాలను ఏర్పాటు చేశారు. కాశీనాథ్‌బాబాతో పాటు అంతర్‌గామకు చెందిన కరణ్ గజేంద్రమహరాజ్, బర్ధీపూర్ ఆశ్రమ పీఠాధిపతి అవదూత గిరిమహారాజ్‌ల ఆధ్వర్యంలో గురువారం ఉదయం సరస్వతీ దేవితో పాటు సూర్యభగవాన్, షిర్డీసాయిబాబా ఆలయాల్లో ప్రత్యే పూజలను నిర్వహించనున్నారు. అనంతరం జ్యోతిర్లింగాలకు అతిరుద్రయాగాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం వేదపండితులు హోమాలను నిర్వహించనున్నారు. ఈ యాగానికి హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కాశీనాథ్‌బాబా కోరారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...