నీటి ఎద్దడి నివారణకు చర్యలు


Wed,May 22, 2019 11:28 PM

అందోల్, నమస్తే తెలంగాణ: అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ మీర్జా ఫసహత్ ఆలీబేగ్ అన్నారు. బుధవారం జోగిపేటలోని ఆయా వార్డుల్లో పర్యటించిన ఆయన బోరు మోటర్‌లు, నల్లా కనెక్షన్‌లను పరిశీలించారు. ఆయా కాలనీల్లో ప్రజలతో మాట్లాడి నీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయాలపై ప్రజల నుంచి సలహాలను, సూచనలు తీసుకున్నారు. నీటి సమస్య ప్రధానంగా ఉన్న కాలనీలకు వాటర్ ట్యాంకర్‌ల ద్వారా నీటిని అందిస్తామని, ప్రజలు ఎవ్వరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పట్టణంలో 117 బోరు మోటార్లు ఉండగా, వాటిలో వేసవి కాలం కావడంతో కొన్ని బోర్లలో నీటి లభ్యత తగ్గిపోయినట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం నీటిని అందిస్తున్న బోరు మోటార్లను సక్రమమైన పద్ధతిలో వాడుకోవాలని, అదే విధంగా ప్రజలు కూడా నీటిని పొదుపు చేయాలని ఆయన సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్ది భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, దీంతో బోరు మోటార్లలో నీటి శాతం తగ్గుతున్నాయన్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలన్నింటినీ ప్రజలందరి సహకారంతో పరిష్కరిస్తానని ఆయన హామీనిచ్చారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...