రెండో విడుత గొర్రెల పంపిణీ షురూ


Wed,May 22, 2019 01:55 AM

సంగారెడ్డి రూరల్ : ప్రసుత్తం ఎండాకాలం ఉన్నందున గొర్రెల అందించే మేత కొరత ఉన్నందున ప్రభుత్వమే ఉచితంగా గొర్రెలకు దాణాను అందజేస్తుందని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర కార్యదర్శి సందీప్ సుల్తానియా అన్నారు. మంగళవారం కంది మండలంలోని చెర్లగూడెంలో గొర్రెల దాణా పంపిణీ కార్యక్రామన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలకు సకాలంలో మేతను వేస్తే అవి ఆరోగ్యంగా ఎదుగుతాయని, గొర్రెల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా దాణాను అందజేస్తుందన్నారు. ప్రభుత్వం అందిం చే ఈ దాణాలో మంచి పోషకాలతో పాటు ప్రొటీన్, మినరల్స్‌లు సరైన మోతాదులో ఉంటాయన్నారు. దాణా ఖ ర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని, యూనిట్‌కి కేటాయించిన డబ్బులోంచి దా ణాకి రూ.3445/- ప్రభు త్వం కేటాయించిందని, రూ.16.25 కిలోకు ప్రభుత్వ కొనుగోలు చేసి ఉచితంగా అందిజేస్తుందన్నారు. కావున గొర్రెలను పెంచే లబ్ధిదారులు ప్రభుత్వం అందించే పోషక విలువలతో కూడిన దాణాను తీసుకుని గొర్రెల ఆరోగ్య సంరక్షణతో పాటు వాటి పెరుగుదలకు దోహదపడాలన్నారు.

డీడీ కట్టిన రైతులకు గొర్రెలు...
రాబోయే రోజుల్లో గొర్రెల కోసం ప్రభుత్వానికి డీడీలు కట్టిన రైతులకు గొర్రెల అందజేసస్తామని ఆయన అన్నారు. గొల్ల కురుమలను ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సబ్సిడీ క్రింద గొర్రెల అందజేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గొర్రెల అభివృద్ధి శాఖ ఎండీ లకా్ష్మరెడ్డి, జేడీ రామారావు రాథోడ్, డాక్టర్ ఇర్ఫాన్, సి బ్బంది లక్ష్మణ్‌రావు, ఇక్బాల్, రాజ్‌కుమార్, మాజీ స ర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...