లెక్కింపులో జాగ్రత్తలు పాటించాలి


Wed,May 22, 2019 01:54 AM

అందోల్, నమస్తే తెలంగాణ: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో ఎన్నికల సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదని అందోలు ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. మంగళవారం జోగిపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల సిబ్బంది పాటించాల్సిన నియమ నిబంధనలను ఆయన వారికి వివరించారు. ఈ నెల 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఎన్నికల సిబ్బంది మాత్రం ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఈ కౌంటింగ్‌లో 22 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కొ టేబుల్‌కు ముగ్గురు అధికారులు ఉంటారన్నారు. బ్యాలెట్ పేపర్‌తో జరిగిన ఓటింగ్ కావడం వలన ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు సమయంలో చాలా జాగ్రత్తగా లెక్కించాల్సి ఉంటుందని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆయన సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్‌వో రంగయ్య, ఎంపీటీసీ ఆర్‌వోలు సంగప్ప, విశ్వనాథం, రవీందర్‌రెడ్డి, ఈవోపీఆర్‌డీ శ్రీనివాస్‌రావు, మాస్టర్ ట్రైనర్ రాజమల్లులో పాటు తదితరులు ఉన్నారు.

కౌటింగ్‌లో నిర్లక్ష్యం చేయరాదు
రాయికోడ్: ఈ నెల 27న రంజోల్‌లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో నిర్లక్ష్యం చేయరాదని ఎంపీడీవో స్టీవేన్‌నీల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ఐకేపీ సమావేశా మందిరంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కౌటింగ్ సిబ్బంది కౌటింగ్ కేంద్రాలకు ఉ. 6 గంటలకు చేరుకోవాలన్నారు. మండంలోని 12 ఎంపీటీసీలకు 24 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లకు పాసులను అందచేయడం జరిగిందన్నారు. ఏజెంట్లలు, సిబ్బందికి ఎవరికైన పాసులు అవసరం ఉంటే ఆర్‌వో దగ్గర తీసుకోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బంది ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని ఎంపీడీవో వివరించారు.

కౌంటింగ్ అధికారులకు శిక్షణ
పుల్కల్: ఈ నెల 27న జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన అధికారులకు మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు. మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానానికి ఈ నెల 10న ఎన్నికలు జరిగిన విషయం తెలిసందే. ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ 27న జోగిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగనున్నది. 15 ఎంపీటీసీ స్థానాలకు గాను 30 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
పకడ్భందీగా ఓట్ల లెక్కింపు చేపట్టాలి
హత్నూర: ఈ నెల 27న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడబ్బందీగా చేపట్టాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 15 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం జరిగిందన్నారు. ఒక్కో ఎంపీటీసీ పరిధిలో రెండు టేబుల్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కాగా ఒక టేబుల్ వద్ద ముగ్గురు కౌంటింగ్ చేసే సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. మండల ఓట్ల లెక్కింపుకోసం కౌంటింగ్ కేంద్రంలో 32 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఓట్ల లెక్కింపు సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సూపరింటిండెంట్ శ్రీధర్, ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...