నకిలీ విత్తనాలను విక్రయించ వద్దు


Tue,May 21, 2019 11:51 PM

అందోల్, నమస్తే తెలంగాణ: ఎరువుల దుకాణాల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించాలని, నకిలీ విత్తనాలను విక్రయించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జోగిపేట సీఐ తిరుపతి రాజు హెచ్చరించారు. మంగళవారం జోగిపేటలోని ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయాధికారిణి విజయరత్న, ఎస్‌ఐ వెంకట రాజాగౌడ్‌తో కలిసి తనిఖీ చేశారు. ఆయా ఫర్టిలైజర్ దుకాణాల్లోని ఎరువులకు, విత్తనాలకు సంబంధించిన పలు రికార్డులను, విక్రయానికి సిద్ధంగా ఉన్న విత్తనాలు, ఎరువులను వారు పరిశీలించారు. రికార్డుల్లో క్రయవిక్రయాలకు సంబంధించి స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.

ఎరువులను, విత్తనాలను కొనుగోలు చేసిన రైతులందరికీ తప్పనిసరిగా రసీదులను ఇవ్వాలని, ఎంఆర్‌పీ ధరల కంటే అధికంగా విక్రయించ కూడదని సీఐ అన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో అధిక ధరలకు ఎరువులను, విత్తనాలను విక్రయించినట్లయితే, వారి వివరాలను రైతులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం ఏవో విజయరత్న మాట్లాడుతూ ఫర్టిలైజర్ దుకాణాలను అనుమతిలేకుండా కొనసాగిస్తే, వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయించాలన్నారు. వానకాలం సీజన్‌లో రైతులు ఏఏ విత్తనాలను ఏ మేరకు వేయాలన్నది, పంటలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులను అడిగి తెలుసుకోవాలని ఆమె సూచించారు.

కంకోల్‌లో ఫర్టిలైజర్ దుకాణం తనిఖీ
మునిపల్లి: మండల పరిధిలోని కంకోల్ సంగమేశ్వర ఫర్టిలైజర్ దుకాణంలో మండల వ్యవసాయాధికారి శివకుమార్ మంగళవారం తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు, మందులకు సంబంధించి బిల్లులు, కంపెనీ లేబుల్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో శివకుమార్ మాట్లాడుతూ నకిలీ పురుగులు మందులు ఎవరూ కూడా విక్రయించొద్దని, విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...