ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం


Mon,May 20, 2019 11:27 PM

కొండాపూర్‌: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే టాప్‌ వన్‌లో నిలిచారు. ప్రైవేటు పాఠశాలలకంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాబోధన చాలా బాగుంది అనడానికి ఇటీవల వెలువడిన ఫలితాలే నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలలు పదిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాయి. కొండాపూర్‌ మండలంలోని తొగర్‌పల్లి, కొండాపూర్‌, మారేపల్లి, గంగారం, సీహెచ్‌ కోనాపూర్‌, అనంతసాగర్‌ (బాలికలు), తెర్పోల్‌, గొల్లపల్లి, మల్లేపల్లి 11 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ఒక కేజీవీబీ ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. మల్కాపూర్‌, అనంతసాగర్‌ బాలుర పాఠశాలల్లో మాత్రమే కొంత ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి, విద్యార్థుల పట్టుదల కొండాపూర్‌ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని చెప్పవచ్చు. కాగా, మెరుగైన ఫలితాలను సాధించడం కోసం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించామని మండల విద్యాశాఖ అధికారి భీంసింగ్‌ వివరించారు. విద్యార్థులపై పాఠాలను బోధించడమే కాకుండా ప్రయోగాత్మకంగా డిజిటల్‌ తరగతులను నిర్వహించారు. దీంతో విద్యార్థులు ప్రతి విషయాన్ని నేర్చుకునేందుకు ఉత్సాహం చూపారు. ఉపాధ్యాయులు సిలబస్‌ను రెండు సార్లు రివిజన్‌ చేయడంతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారికి అర్థం అయ్యేలా పాఠ్యాంశాలను బోధించడంతో పాటు ఒక్కొక్క గ్రూపునకు ప్రతి ఉపాధ్యాయుడిని బాధ్యుడిగా నియమించారు. దీంతో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేశారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...