కాళేశ్వరం ప్రపంచానికే ఆదర్శం


Mon,May 20, 2019 11:27 PM

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ సాగునీటి అవసరాలను తీర్చడానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైన్‌ చేశారని, ఇది ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి తెలిపారు. గజ్వేల్‌ ప్రెస్‌ క్లబ్‌లో సో మవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎత్తిపోతలకు భారీగా వి ద్యుత్‌ అవసరం కాగా, ఈ ప్రాజెక్ట్‌తో విద్యుత్‌ సమస్య ఉత్పన్నం కాదన్నారు. భూనిర్వాసితులకు దేశంలో ఎక్కడా లేని విధంగా పరిహారం వర్తింప చేశారని దీనిపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్‌ స్వార్థ రాజకీయ చర్యల వల్ల ఎడాది పాటు పనులు స్తంభించినట్లు తెలిపారు.

ప్రాజెక్ట్‌లతో జిల్లా సస్యశ్యామలం..
మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ రిజర్యాయర్లతో సిద్దిపేట జిల్లా సస్యశ్యామలం అవుతుందని భూంరెడ్డి తెలిపారు. రెండు రిజర్యాయర్లకు 21,600 ఎకరాల భూమిని సేకరించారని ఇందులో కొద్దిమంది రైతులు మాత్రమే ఇంకా తమ సమ్మతి తెలుపాల్సి ఉందన్నారు. భూనిర్వాసితులు కోరుకున్నుట్లు పరిహారం అందిస్తారన్నారు. కాంగ్రెస్‌ నేతలకు ప్రజల్లో ఆదరణ కరువైందన్నారు. వారిని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో ఎంపీపీ చిన మల్లయ్య, పట్టణ పార్టీ అ ధ్యక్షులు గోపాల్‌రెడ్డి, నా రాయణ రెడ్డి, మద్ది రాజిరెడ్డి, నాగులు, బోస్‌, వసీంఖాన్‌, జాకీ, శ్రీను, ప్రవీణ్‌, రాజ్‌కుమార్‌, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...