ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలి


Mon,May 20, 2019 11:27 PM

-ఎంపీడీవో స్టీవేన్‌నీల్‌
రాయికోడ్‌: గ్రామాల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఎంపీడీవో స్టీవేన్‌నీల్‌ అన్నారు. సోమవారం ఐకేపీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామి, ఐకేసీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మరుగుదొడ్డి నిర్మాణం చేసుకున్న వారికి ప్రభుత్వం రూ.12వేల అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామి, ఐకేపీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి మరుగుదొడ్డి నిర్మాణం చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ నెల 30 వరకు నిర్మించుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం అందించే రూ.12 వేల అందించడం జరుగుతుందన్నారు.

కాగా ప్రస్తుతం వివిధ రకాల ఎన్నికల కౌటింగ్‌ జరుగనున్న తరుణంలో గ్రామ స్థాయి అధికారులు అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. అధికారులు అత్యవసర పరిస్థితులలో తప్ప సెలవులు వినియోగించుకోరాదని ఆయన ఆదేశించారు. ప్రతి గ్రామంలో నీటి సమస్యను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే సంవత్సరం హరితహారంలో మొక్కలు నాటేందుకు ఉపాధిహామి పథకంలో ప్రతి పంచాయతీకి ఒక్కటి చొప్పున నర్సరీలు ఏర్పాటు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మౌళిక అవసరాలను ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధిహామీ, ఐకేపీ మండల అధికారులు గురుపాదం, నర్సింహులు, ఉపాధిహామి క్యూసీ విష్ణు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ,ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...